బాసర క్షేత్రం లో జరిగిన కవి సమ్మేళనం లో చదివిన నా రెండు కవితలు :
1 . సృజనా ! నా ప్రియ సోదరీ !
పట్టరాని ఆనందాన్ని పంచుకునే తోడులేక
గాలిబుడగై మనసూగిపోతుంటే
తుళ్ళిపడే మనో భావాలన్నిటినీ
పదాల సుమ గుచ్చాలుగా
కాగితాలపైకి పోగుచేసి
పరిమళాలన్నీ మోసుకుంటూ వెళ్ళింది నువ్వే కదా !
ఆ సుమ గంధం వ్యాపించినంత మేరా
ఈ ఒంటరి సంతోషాన్ని పంచుకుంటూ
మురిసి విరిసిన వదనాలెన్నని లెక్కించను?
కమ్మేసిన వేదనతో గుండె బరువెక్కి పోయి
ప్రెషర్ కుకర్ లా పేలడానికి సిద్ధమైనపుడు
సేఫ్టీ వాల్వ్ లా తెరుచుకుని
దుఃఖపు ఆవిరిని అక్షర సమూహంగా మార్చి
సాహితీ గగనం లోకి పరుగులు పెట్టించిందీ నువ్వే !
నా ఒంటరి కంటం వెలువరించిన ఆక్రందనకి
ప్రతిస్పందిస్తూ చెమరించిన నయనాలెన్నని వర్ణించను?
రోదనైన వేదనకి స్పందించని హృదయాలే
కష్టం కావ్యమై కదను తొక్కితే
కరతాళధ్వనులతో స్వాగతించాయి !
సృజనా! నా ప్రియ సోదరీ !
నీవిచ్చిన స్ఫూర్తి తో నే గొంతెత్తి ,
ఎదురైన వ్యధిత హృదయాలన్నిటికీ చెపుతున్నా ..
సంతోషమైనా సంతాపమైనా
గుండె గదిని మూసి భావోద్వేగాలను ఆవిరిగా పేర్చుకోవద్దని
వాటిని సిరాగా మార్చి కలాలు నింపుకోమని
మనసు రెక్కలు తెరిచి మేఘసందేశానికి శ్రీకారం చుట్టమని !
వీచేగాలీ వెల్లువెత్తే కెరటాలూ కూడా
నిపుణుడైన నావికుడి చేతిలో కీలుబోమ్మలవుతాయట
శోధిస్తే వేదన శోభించే కావ్యమవుతుంది
ప్రయత్నిస్తే సృజన ప్రతి ఒకరికీ సాధ్యమవుతుంది
హృదయ ఘోషలోంచి కళాఖండం జనిస్తుంది !
* * * *
1 . సృజనా ! నా ప్రియ సోదరీ !
పట్టరాని ఆనందాన్ని పంచుకునే తోడులేక
గాలిబుడగై మనసూగిపోతుంటే
తుళ్ళిపడే మనో భావాలన్నిటినీ
పదాల సుమ గుచ్చాలుగా
కాగితాలపైకి పోగుచేసి
పరిమళాలన్నీ మోసుకుంటూ వెళ్ళింది నువ్వే కదా !
ఆ సుమ గంధం వ్యాపించినంత మేరా
ఈ ఒంటరి సంతోషాన్ని పంచుకుంటూ
మురిసి విరిసిన వదనాలెన్నని లెక్కించను?
కమ్మేసిన వేదనతో గుండె బరువెక్కి పోయి
ప్రెషర్ కుకర్ లా పేలడానికి సిద్ధమైనపుడు
సేఫ్టీ వాల్వ్ లా తెరుచుకుని
దుఃఖపు ఆవిరిని అక్షర సమూహంగా మార్చి
సాహితీ గగనం లోకి పరుగులు పెట్టించిందీ నువ్వే !
నా ఒంటరి కంటం వెలువరించిన ఆక్రందనకి
ప్రతిస్పందిస్తూ చెమరించిన నయనాలెన్నని వర్ణించను?
రోదనైన వేదనకి స్పందించని హృదయాలే
కష్టం కావ్యమై కదను తొక్కితే
కరతాళధ్వనులతో స్వాగతించాయి !
సృజనా! నా ప్రియ సోదరీ !
నీవిచ్చిన స్ఫూర్తి తో నే గొంతెత్తి ,
ఎదురైన వ్యధిత హృదయాలన్నిటికీ చెపుతున్నా ..
సంతోషమైనా సంతాపమైనా
గుండె గదిని మూసి భావోద్వేగాలను ఆవిరిగా పేర్చుకోవద్దని
వాటిని సిరాగా మార్చి కలాలు నింపుకోమని
మనసు రెక్కలు తెరిచి మేఘసందేశానికి శ్రీకారం చుట్టమని !
వీచేగాలీ వెల్లువెత్తే కెరటాలూ కూడా
నిపుణుడైన నావికుడి చేతిలో కీలుబోమ్మలవుతాయట
శోధిస్తే వేదన శోభించే కావ్యమవుతుంది
ప్రయత్నిస్తే సృజన ప్రతి ఒకరికీ సాధ్యమవుతుంది
హృదయ ఘోషలోంచి కళాఖండం జనిస్తుంది !
* * * *
nice congrats nagalakhmi.
ReplyDeletekavitalu chaalaa baavunnaayi. congrats n hats off to u nagalakshmi gaaru. u r a versatile genius. v expect more such literary creations from ur mighty n ready pen in the womb of the times to come,
ReplyDeletebhasker koorapati.
సత్యా, థాంక్ యూ ! భాస్కర్ గారూ! మీ అభిమానానికి ధన్యవాదాలు!
ReplyDeleteవొంటరి తనానికి
ReplyDeleteవ్యధిత హృదయాలకి స్వాంతన
అక్షర రూపం కావ్యం అయితే
తేలికైన హృదయ స్పందనకి
తోడైన సృజన భావాలకు హరివిల్లై
మరో కావ్యం అవుతుంది
మరెన్నో అక్షర సుమాలు
మీ కలం నుంచి జాలువారాలని
మణిమయ నాగాభారణాలు కావాలని
మనసార కాంక్షించే మిత్రురాలు
మణి గారూ,కృతజ్ఞతలు!
ReplyDelete