వాన చినుకులు పడ్డాక ప్రకృతి కడిగిన ముత్యంలా స్వచ్ఛమవుతుంది.ఎండిన నేలలో ఎదురుచూస్తున్న గింజలకి మొలకెత్తే అవకాశం వస్తుంది!ఎండకి ఆవిరైన నీరు మేఘాలుగా పోగుపడి వాన చినుకులుగా కురిసినట్టే అనేక సందర్భాలలో మనసులో కలిగే స్పందనలు పాటలుగా కవితలుగా కథలుగా గీతలుగా వర్ణచిత్రాలుగా ఈ బ్లాగులో కురిసినపుడు మీకు నచ్చితే మీ స్పందన తెలియజేయండి.
త్వరలో వెలువడ బోయే శ్రీవల్లీ రాధిక కథల సంపుటి లో కథల కోసం కొన్ని బొమ్మలు
దంపతుల మధ్య ధర్మ యుతమైన సాహచర్యాన్ని నిర్వచించిన కథ.సహ ధర్మ చారిణి
సత్తెమ్మ చేయించిన సత్య దర్శనం -సత్యం
సౌందర్యం కేవలం కనుముక్కుతీరుకూ, శరీర లావణ్యానికీ సంబంధించినదా లేక చూసే వ్యక్తి అంతరంగంలో రేకెత్తే భావపరంపరకు సంబంధించినదా ?అందాన్ని కవితాత్మకంగా నిర్వచించిన సుందరికి తన కవితకర్ధం ఏమిటో తెలియజెప్పిన సంఘటన ! ' సౌందర్యం'
మనసు కోరినవన్నీ అందిస్తూ దానికి బానిసై నడుస్తూ, వత్తిడి ని అధిగమించడానికి అదే మార్గమని నమ్మే అమ్మాయి, ఇంద్రియ సుఖాలను కోరే మనసుని తన చెప్పుచేతల్లో ఉంచుకోవడం ద్వారా జ్ఞాని అయిన వ్యక్తి , వత్తిడినెలా జయిస్తాడో తెలుసుకున్న వైనం- ' విముక్తి ' కథ
No comments:
Post a Comment