ఉదయ కిరణాలన్నీఆటోలో ఇరుక్కున్న
బాల భానుళ్లై
బాల భానుళ్లై
భూ భారాన్ని వీపుల కెక్కించుకుని
బడికి పోతున్నాయి!
బడికి పోతున్నాయి!
విస్తరించిన తరు శాఖల ఛాయల్లో
విశ్రమించిన ఇళ్ళన్నీ
విశ్రమించిన ఇళ్ళన్నీ
తరువుల్ని తరిమేసి
ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాయి !
ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాయి !
పెరిగిన వత్తిడికి పగిలిన గొట్టాలలో తాగునీరూ
మురుగు నీరూ చెట్టా పట్టాలేసుకుంటున్నాయి
ప్రతి వీధీ ఒక టిఫిన్ సెంటరే !
రకరకాల రుచులు తిరిగి తిరిగి మరిగే నూనెలో
కరకర లాడుతున్నాయి
కరకర లాడుతున్నాయి
ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ కాఫీలై పొగలు కక్కుతున్నాయి
నగరం తిని తాగి పారేసిన చెత్త, మట్టిలో కలవనని మొరాయిస్తోంది
సిటీ సివిక్ సెన్సంతా చేటల్లోకెక్కి
ప్రహరీ మీంచి వీధిలోకి దూకుతోంది
అంతుపట్టని రోగాలు
కార్పొరేటు ఆసుపత్రుల కంప్యూటర్లలో
భారీ బిల్లులై ఆత్రంగా బయటికొస్తున్నాయి !
డిస్కౌంట్ల వలలనిండా కస్టమర్ల కరెన్సీ చేపలే !
ఆకర్షించే ప్యాకేజీలు ఇంటికొచ్చి
గార్బెజిగా రూపాంతరం చెంది
చెత్తకుప్పలపై ఆటలాడి,
మురుగు కాల్వల్లో స్నానమాడుతున్నాయి !
వార్తా పత్రిక లో మొదటి పేజీ వార్త -
నగరం పేరు నరకం గా మారుస్తారట !
జనంలో మృగ్యమైన పాపభీతి దైవ భక్తిగా మారి
మైకుల్లో విజృంభించి కాలనీల కర్ణ భేరిని చేదిస్తోంది !
అసహనం వాహనాలెక్కి
జనం చెవులు చిల్లులు పొడుస్తోంది
ఆగిన కారుల ఆగని హారన్లకి
నగరం హాహాకారం చేస్తోంది !
పక్కవాడి గొడవ పట్టని తనం
ఉగ్రవాదానికి పీఠం వేస్తోంది
గ్లోబలైజేషన్ పిశాచం, గోరీ లోంచి పైకొచ్చి
నిశీధిని శాసిస్తోంది,
ప్రకృతి నియమాలను పరిహసిస్తోంది !
నడిరేయి ఏ జాములోనో నిశ్శబ్దంగా నడిచొచ్చి
అలసిన కళ్ళకి చీకటి పరదాలేసి,
మానని గాయాలకి చల్లని లేపనాలద్ది
జోలపాడి నిదురపుచ్చే ప్రియబాంధవి
'యామిని' ఏదీ?
కనిపించదేం ?
అయ్యో ! ఆమె మరణించిందా ?
దయచేసి శబ్దం చేయకండి ...
రెండు నిముషాలు మౌనం పాటిద్దాం !
(నది మాసపత్రిక లో ప్రచురితమైన కవిత )
కవిత చాలా బాగుందండీ.
ReplyDeleteపీల్చేందుకు గాలి కూడా దక్కని పరిస్థితుల్లో వున్నామన్న వాస్తవాన్ని కవితాత్మకంగా బాగా చెప్పారు. అభినందనలు..
ధన్య వాదాలు శ్రీ లలిత గారూ !
ReplyDeleteకవిత ఊపిరాడనివ్వక ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ReplyDeleteకవితకే ఉక్కిరిబిక్కిరైపోతే వాస్తవాన్ని తట్టుకునేది ఎలాగండి?
ReplyDelete