June 4, 2014

పర్యావరణ రక్షణతోనే జాతి మనుగడ

        (జూన్ 5 వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నది మాస పత్రిక వెలువరించిన ప్రత్యేక వ్యాసం )
                     
     ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడూ జూన్ వ తేదీని జరుపుకుంటున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొదటిసారిగా 1973 లో జరిగింది.  ప్రపంచ దేశాల  ప్రభుత్వాల మధ్య పర్యావరణపు రాజకీయ,  సామాజిక,  ఆర్ధిక సమస్యల గురించి  చర్చలు జరిగిఅవి పరిష్కార దిశగా పురోగమించిన మొదటి సమావేశం ఇదే.  అప్పటినించి ప్రతి ఏటా ఈ ఉత్సవం వేర్వేరు దేశాలలో వివిధమైన నినాదాలతో జరుగుతూ వస్తోందిప్రకృతి సమతుల్యతని పరిరక్షించుకోవడమే ఈ ఉత్సవపు ముఖ్యోద్దేశ్యం .  

       ఋగ్వేదం లోని  "ఓం మధువాతా  ఋతాయతే మధుక్షరంతి సిన్ధవః అంటూ సాగే శ్లోకపు అర్థాన్ని చూస్తే  'వాయువులు హాయిని గొలుపుతూ వీచుగాక నదులు మధురమైన ఉదకమును ప్రసాదించుగాక ఓషధులు మధురమై హితకరములగుగాక రాత్రియందు మరియు ప్రాతః కాలము నందు ధూళి సైతం మాధుర్యోపేతమగుగాక తండ్రితో సమానమగు  ఆకాశం మధురమగుగాక వనస్పతులు మధుఫల సమన్వితములగుగాక సూర్యుడు మాధుర్యము గలవాడగుగాక గోవులు మధురమైన క్షీరములనొసగుగాక ! ' అనే లోక హిత కాంక్ష కనిపిస్తుంది
      ప్రాణికోటి మనుగడకు ఆవశ్యకమైన నేలనీరు గాలి అగ్ని,ఆకాశం అనే పంచ భూతాలను కాలుష్యరహితంగా  కాపాడుకోవలసిన వసరాన్నిబాధ్యతను వేల సంవత్సరాల క్రితమే మనిషి గుర్తించాడుప్రకృతిని ప్రేమించి పూజించే వ్యక్తి,  ప్రకృతి అందించే వరాలను దుర్వినియోగ పరచలేడు.         అయితే  ఇటీవలి కాలంలో మనిషి  శాస్త్ర విజ్ఞాన రంగంలో తను సాధించిన పురోగతినుపయోగించుకునిభౌతిక సుఖాల వైపు పరుగులు తీస్తూప్రాచీన సంప్రదాయాలూసదాచారాల పట్ల విముఖతని పెంచుకుంటున్నాడుస్వార్ధ పూరితమైన దృక్పథం తో కేవలం తన జీవిత కాలం పూర్తయ్యేవరకు ఈ వనరులన్నీ నిలిస్తే చాలుతనకిష్టమైనట్టు వాడుకుందుకు వీలుగాతన అవసరాలకు సరిపడా పంచ భూతాలూ చరిస్తే చాలుఅనుకుంటున్నాడు
     ప్రకృతి అందించిన సంపదను పదిలంగా తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత తనదనే గుర్తింపు లేకపోవడంతో పీల్చే గాలీతాగే నీరూనడిచే నేల... అన్నీ స్వచ్చతని కోల్పోతున్నాయిపరిశ్రమల నుంచి వచ్చే విష వాయువులతో కలిసి గాలి దుర్గంధ భూయిష్టమైపోతోందినదీ జలాలు మురుగు నీటి తోమలమూత్రాలతో కలుషితమైపోతున్నాయిఇంధనం కోసమోఇళ్ళ స్థలాల కోసమోమనుషుల ఇతర అవసరాల కోసమో  వనాలు తరిగి పోతున్నాయిపంటలు క్రిమి సంహారకాలతో రోగ కారకాలవుతున్నాయిఅతినీలలోహిత కిరణాలనుండి  మనను కాపాడిన ఆకాశపు ఓజోను పొరలో  మానవాళి స్వార్ధం వల్ల  ఏర్పడ్డ రంధ్రంరాను రానూ విస్తరిస్తూండడంఅనేక రోగాలకు కారణమవుతోందికరుణతో మనకి వెలుగునీఆరోగ్యాన్నీ అందించిన సూర్యుడే  గ్లోబల్ వార్మింగ్ కి గురై అనూహ్యమైన అవాంఛనీయమైన వాతావరణ మార్పులకి కారణమవుతున్నాడుఒకప్పుడు స్వచ్ఛమైన కమ్మని క్షీరాన్నిచ్చిన పశు సంతతి , కలుషితమైన మేత కారణంగానూ , పాలఉత్పత్తి సేకరణలలో జరుగుతున్నఅక్రమాల  కారణంగానూ   అనారోగ్యకరమైన పాలని అందిస్తున్నాయి

     తాను  కూర్చున్న కొమ్మను తానే  నరుక్కునే మూర్ఖుడి లాగా మనిషితన మనుగడకు అత్యంతావశ్యకమైన వనరులన్నిటినీ  విచక్షణా రహితంగా దుర్వినియోగ పరుస్తూ తన వినాశనానికి తానే  కారకుడవుతున్నాడు.  సృష్టిలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న సమతుల్యతని చిన్నాభిన్నం చేస్తూతన మనుగడకు తానే  చేటు తెచ్చుకుంటున్నాడుమనిషి పీల్చి విడిచిన గాలిని తీసుకునిప్రాణ వాయువునందించే కర్మాగారం చెట్టుమురికి నీరు ఎండ వేడికి ఆవిరైస్వచ్చమైన వర్షపు నీరుగా మళ్ళీ ప్రాణి కోటిని చేరుతుందినేలని విష భరితం చేయకుండావాతావరణాన్ని కాలుష్యాలతో నింపకుండా ఉంటేవర్షమై కురిసే శుద్ధ జలాలు స్వచ్చమైన స్థితిలో మళ్ళీ భూమిని చేరుతాయిచెరువులుగానదులుగాకాలువలుగాజలపాతాలుగాసెలయేళ్ళుగా   మనిషి నీటి అవసరాలను తీర్చగలుగుతాయివిచ్చలవిడిగా జరిగిన పారిశ్రామికీకరణ వల్ల  నేలాగాలీ కూడా పరిశ్రమల నుండి వెలువడే వ్యర్ధాల వల్ల  కలుషితమైపోతున్నాయిప్రకృతిలో సహజ సిద్ధంగా శుభ్రపడే పదార్ధాలు కూడా తిరిగి కాలుష్యానికి లోనవుతున్నాయి  
     ఒకప్పుడు   గ్రామాల్లోనే కాకుండా నగరాల్లో కూడా శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్లు కనపడేవిరకరకాల పూలతో పక్షులతో ఆ కొమ్మలన్నీ కల కళ లాడేవిగత పాతిక ముప్ఫై సంవత్సరాలలో మన నగరాల రూపమే మారిపోయిందికొన్ని దేశాల్లో ఒక చెట్టు కొట్టివేయాలంటే రెండు చెట్లు నాటిఏడాదిపాటు పెంచిప్రభుత్వం నుంచి అనుమతి పొందితేగాని  ఆ పని చేయడానికి వీల్లేదుకానీ అలాంటి చట్టాలేవీ అమలులో లేని మన దేశం లాంటి దేశాల్లో,  వందేళ్ళ వయసున్న వృక్షాలైనా మనిషి విచక్షణా రాహిత్యానికి పరాకాష్టగా నేలమట్టమై పోతున్నాయిఈ భూమిపై ఉన్న వనరులన్నీ  తరతరాల వారసత్వ సంపదగా మనకు దక్కినవి వీటిని ముందు తరాల కోసం పదిల పరుస్తూఅనుభవించే హక్కు మాత్రమే  మనకుంది.  మన పూర్వీకుల నిత్య కృత్యాలలో పర్యావరణ పరి రక్షణ కూడా ఒక భాగంగా ఇమిడిపోయి ఉండేది
    రక రకాల పూవులనీఆకులనీమూలికలనీ,  పక్షులనీపశువుల్నీఅన్నిటినీ గౌరవించిపూజిస్తూ  జాతీ అంతరించి పోకుండా ఉండే విధంగా ఆచార వ్యవహారాలనీ పండుగలూపర్వదినాలనీ తీర్చిదిద్దుకున్నారు మన పూర్వులుసంవత్సరం పొడుగునా మారే ఋతువులని బట్టిఆయా కాలాలలో దొరికే  ఆకులూ,  పూవుల ప్రాశస్త్యాన్ని బట్టిఅనేక పండుగలనుఆరాధనా రీతులనుఆరోగ్య విధానాలను ఏర్పరచుకున్నారుపర్యావరణం పరిరక్షించబడాలంటే జీవ జాలమంతా  పరిరక్షించబడాలనిప్రకృతిలో సమతుల్యత నిలబడాలంటే అన్నిరకాల జీవాలూవృక్ష జాతులూ అంతరించిపోకుండా నిలవాలనీ  తెలుసుకున్న మన పూర్వీకులు ఎంతో  శ్రద్ధతో ఆచరించిన విధానాలను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం.  నగరాల్లో గృహ సమస్య పేరున చెట్లు కొట్టేసిబహుళ అంతస్తుల భవనాలు నిర్మించడంతో  పీల్చే గాలిని శుభ్రపరచే వ్యవస్థ మాయమైపోతోంది. వాటిమీద ఆధారపడి జీవించే పశుపక్ష్యాదులు కనుమరుగైపోతున్నాయి.  కాంక్రీటు రహదారులకి రెండు పక్కలా నేల కనపడకుండా ఫుట్ పాత్ లు నిర్మించడం వల్ల ఎంత వర్షం కురిసినా ఆ నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేక రోడ్డు పైనున్న చెత్తా చెదారంతో కలిసి మురుగు నీరై పొంగి పొర్లి పోతోందిఒక్క వర్షానికే కొన్ని గృహ సముదాయాలు ముంపుకి గురవుతున్నాయిరోడ్డుకిరుపక్కలా ఉండే ఫుట్ పాత్ ల మీద చిన్నపాటి ఖాళీ స్థలం వదులుతూ టైల్స్ పరిచినట్టయితే వర్షపు నీరు భూమిలోకి ఇంకే వీలుంటుందిభూ గర్భ జల మట్టం పెరిగే అవకాశం ఉంటుందిఇంతటి సులువైన పరిష్కార మార్గాలు కూడా మన టౌన్ ప్లానింగ్ విభాగపు అధికారుల దృష్టికి రాక పోవడం ఎంత శోచనీయం 
     వాతావరణ కాలుష్యంలో మరో ముఖ్యమైన అంశం ధ్వని కాలుష్యంనిశ్శబ్దం లోంచి జనించిన ప్రణవ నాదంతో సృష్టి ఆరంభమయిందని విన్నాంనాదానికీశబ్దానికీ మధ్య గల తేడా భౌతిక శాస్త్ర నిర్వచనాల్లో స్పష్టమవుతుందిశ్రావ్యత లోపించిన ధ్వని చెవులకింపుగా ఉండదుఅలాంటి ధ్వనిని ఎక్కువ సేపు వినలేముఈ ధ్వని పరిమాణం పెరిగిన కొద్దీ దీని ప్రభావం శరీరారోగ్యం మీద పడుతుందిప్రస్తుత సమాజం లో పాప భీతి కరువైపోయిదాని స్థానంలో దైవ భక్తి  పేరుతో  ఒక అవాంఛనీయ ధోరణి పెరిగిపోతోంది
   ఎక్కడ వీలయితే అక్కడ ఒక ప్రార్ధనా మందిరాన్ని నిర్మించేయడంసమయం దొరికినప్పుడల్లా మైకులు పెట్టిచెవులు మార్మోగి పోయేలా ప్రార్ధనలు సాగించడంఒక మతం వారిని చూసి మరో మతం వారు  పోటీగా మరింత గట్టిగా భజనలు సాగించడం పరిపాటిగా మారిందినగరాల్లో క్రిక్కిరిసి ఉండే నివాసాలలో మైకుల్లోంచి వెలువడే ఈ ధ్వనిప్రార్ధన జరిగే చోట కన్నా చుట్టూ పక్కల నివసించే వారి చెవుల్లో ఎక్కువగా వినిపించడం ఎంత అన్యాయం ఈ ఇళ్ళల్లో చదువుకునే పిల్లలూ రోగులూ వృద్ధులూ ఉంటే వారి పరిస్థితి ఏమిటి ఎంత సహనం వహించినా  సామాన్యుడి సహన శక్తిని మించి ఈ మైకు మౌఢ్యమ్  విస్తరించడంఎవరైనా భరించలేక ఫిర్యాదు చేసినాకాస్త ధ్వని పరిమాణం తగ్గించమని కోరినా, " ఫలానా మతం వాళ్ళు మైకులు పెట్టి ప్రార్ధనలు చెయ్యడం లేదా మనం మాత్రం ఎందుకు మానెయ్యాలి ?" అంటూ దోషుల్ని చూసినట్టు చూడడం  జరుగుతోంది
      ట్రాఫిక్  జామ్ లోనోరద్దీ సమయం లో రోడ్డు పైనో పది నిముషాలు గడిపితే చాలు మనుషుల్లో విపరీతంగా పెరిగి పోయిన అసహన ధోరణిని గమనించ వచ్చుసిగ్నల్ దగ్గర రెడ్ లైట్ వెలుగుతూ కనిపిస్తున్నా ముందున్న వాహనాలనుద్దేశించి చెవులు గింగుర్లెత్తేలా  హార్న్ మోగించే వాళ్ళు కొందరైతేదూసుకు పోలేదని దూషించే వాళ్ళు కొందరుఆధునిక కాలం లో విపరీతం గా పెరిగిన వినికిడి సమస్యలుహృద్రోగాలురక్త పోటూమానసిక వైకల్యాలూఅనేక అంతు పట్టని రోగాలకు మితిమీరిన ధ్వని కాలుష్యం కూడా కారణమంటే అతిశయోక్తి కాదుపెళ్ళిళ్ళూ ఇతర ఉత్సవాల్లో డప్పులూ టపాసులతో కాలనీ అంతా  విల విల లాడిపోయేలా శబ్ద కాలుష్యాన్ని సృష్టించే సంప్రదాయం ఈ కాలానికి తగినదేనాఇలాంటపుడు  వినాలనిపించని శబ్దాలనుంచి   తప్పించుకునేందుకు కళ్ళకున్నట్టే చెవులకీ రెప్పలుంటే బావుండుననిపించకమానదు 
     గత నలభై సంవత్సరాలుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏటా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంలక్ష్య సాధన దిశగా అడుగులు వేయడం జరుగుతోంది. 'నా వసుధ నా  విధి '(మై ఎర్త్ మై డ్యూటీ అంటూ  ప్రచారం సాగిన  పర్యావరణ పరిరక్షనోద్యమంలో భాగంగా 2010 ఆగస్టు నెల, 25తారీకున,  ఒకే రోజున 34 నగరాల్లో రెండున్నర లక్షల గ్రామాల్లో 73 లక్షల మొక్కల్ని నాటారుఒక వినూత్న ప్రయత్నంగా ఈ కార్యక్రమం లిమ్కా బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లోస్థానం సంపాదించుకుందిఅంతకు ముందే 2008 లో ఎన్డీటీవీ 'గ్రీనథాన్కాంపెయిన్  ప్రారంభించి భారతీయ యువత లో పర్యావరణం పట్ల అవగాహన పెరిగేందుకు ప్రయత్నించింది . ' World Environment Day Global School Contest 2012 ' వంటి కార్యక్రమాలు పాఠశాల స్థాయి బాల బాలికల్లో పర్యావరణ స్పృహ పెరిగేందుకు తోడ్పడ్డాయి .  
        ప్రతి సంవత్సరం ఇరవై వేల కి పైగా పసివాళ్ళు ఆకలికి తాళలేక మరణిస్తుండగాప్రతి ఏడుగురిలో ఒకరు ఖాళీ కడుపుతో నిద్రిస్తుండగా ఏటా దాదాపు 1. బిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతోందని UN Food and Agricultural విభాగం తెలియజేస్తోంది అందుకే క్రిందటి సంవత్సరం ఆహారానికి సంబంధించి  ఆలోచించు ఆస్వాదించు సంరక్షించు  (Think, Eat, Save ) అనే మూడు క్రియాత్మక పదాలని  పర్యావరణ దినోత్సవపు నినాదంగా స్వీకరించి ప్రపంచ వ్యాప్తంగా దిద్దుబాటు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందిఆహారం వృధా కాకుండా చూడడమే కాక తమకిష్టమైన భోజనాన్ని పొందే విషయంలో పర్యావరణం పై దాని యొక్క ప్రభావాన్ని కూడా గమనించాలని ఈ నినాదం ఉద్బోధించిందిప్రపంచ పౌరులుగా ప్రకృతి సమతుల్యత చెడకుండా చూసుకోవడమనేది మన బాధ్యత అని తెలియజేసింది మార్పు అనేది ఇంటి నుంచి మొదలవ్వాలనీ ఔత్సాహికులుగా మనమంతా ఇంట్లో పిల్లలతోనూ  , వీధిలోనూ కార్యాలయాల్లోనూ పరిచయస్తులతోనూ  ఈ విషయం గురించి మాట్లాడాలని సందేశమిచ్చింది.  నగరజీవితంలో  ఎంత కష్టతరమయినాఏమాత్రం స్థలం ఉన్నాపళ్ళూ కూరగాయలనిచ్చే  చిన్నపాటి పెరటి తోటని పెంచమనీ వంటింటి చెత్తతో ఎరువు తయారు చెయ్యమనీ అసలు స్థలమే లేక పోయినా చిన్న ప్లాస్టిక్ సంచిలో కిటికీ గట్టు మీద ఆలుగడ్డలనో మొలకలనో పెంచమనీ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ రవాణా ని ఉపయోగించుకొమ్మనీనడకనీ సైకిల్ వాడకాన్ని అలవాటు చేసుకొమ్మనీ కోరింది. Refuse, Reduce, Reuse, Renew, Recycle అనే మంత్రాన్ని పాటించమనీపర్యావరణ పరిరక్షణ కోసం ఏదైనా చేసి ఉంటే దాని గురించి మాట్లాడమనీ , facebook , ట్విట్టర్ వంటి పబ్లిక్ ఫోరమ్స్ లో పదిమందికీ తెలిసేలా పంచుకోమనీ చెపుతూ పంచ సూత్రాలను రూపొందింఛి పర్యావరణ పరిరక్షణలో ఒక మంచి మార్పుకి శ్రీ కారం చుట్టడం జరిగింది
      ఈ ఏడాది ఐక్య రాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ విభాగం  చిన్నచిన్న ద్వీపరాష్ట్రాల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి పని చేయబోతోంది ఈ దేశాలు ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలూ వాతావరణ మార్పులూ చెత్త నియంత్రణ వనరుల తరుగుదల ప్రకృతి వైపరీత్యాల వంటి సమస్యలపై  కొంత అవగాహన కలిగించడం పరిష్కారాల కోసం ప్రయత్నించడం ఈ సంవత్సరపు ప్రపంచ పర్యావరణ దినోత్సవపు ముఖ్య మైన లక్ష్యాలు

                                                                ***

1 comment:

  1. బాగుంది..మీరు చెప్పిన ఋగ్వేదం లోని శ్లోకం పూర్తిగా అర్ధము తో ఇవ్వగలరా. Please.

    ReplyDelete